Stock Market: నాలుగో రోజూ తప్పని నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:16 AM
విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెగిటివ్‌గా మారాయి. మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. మెటల్ సెక్టార్ భారీ నష్టాల్లో ఉంది. మరోవైపు ఐటీ రంగ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.
దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెగిటివ్‌గా మారాయి. మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. మెటల్ సెక్టార్ భారీ నష్టాల్లో ఉంది. మరోవైపు ఐటీ రంగ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (84, 961)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 200 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఒక దశలో లాభాల్లోకి వచ్చింది. అయితే కాసేపటికే తిరిగి మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 216 పాయింట్ల నష్టంతో 84, 745 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 64 పాయింట్ల నష్టంతో 26, 076 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో బజాజ్ హోల్డింగ్స్, సీజీ పవర్, సోలార్ ఇండియా, ఒబెరాయ్ రియాల్టీ, ఎటర్నల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). హిందుస్థాన్ జింక్, నాల్కో, జిందాల్ స్టీల్, ఎన్‌ఎమ్‌డీసీ, వేదాంత మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 418 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.81గా ఉంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి రేటు..
కరెంట్ తీగలపై కూర్చున్న పక్షులకు ఎందుకు షాక్ కొట్టదు.. కారణమేంటంటే..