ఐటీ సెక్టార్‌లో అమ్మకాలు.. నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు..
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:20 AM
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఐటీ రంగం తీవ్ర పోటీని ఎదుర్కొంటుందనే అంచనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఐటీ రంగం తీవ్ర పోటీని ఎదుర్కొంటుందనే అంచనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. ఇన్ఫోసిస్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, విప్రో వంటి సంస్థల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండడం సూచీలను వెనక్కి లాగుతోంది. ఫలితంగా సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత నష్టాల నుంచి కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (83,739)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. అయితే కాసేపటికి భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 39 పాయింట్ల లాభంతో 83,778 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 51 పాయింట్ల లాభంతో 25,779 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో సీజీ కన్జ్యూమర్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ, కేన్స్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇన్ఫోసిస్, కోఫోర్జ్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, పెర్సిస్టెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 226 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 232 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.41గా ఉంది.
ఇవి కూడా చదవండి..
షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..