ఒడిదుడుకుల్లో సూచీలు.. లాభనష్టాలతో దోబూచులాట..
ABN , Publish Date - Jul 30 , 2026 | 09:55 AM
బుధవారం భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బుధవారం భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిలో ఉండడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.75) బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,654)తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 77,686 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 20 పాయింట్ల లాభంతో 24,270 వద్ద ఉంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో హీరో మోటోకార్ప్, విప్రో, పెర్సిస్టెంట్, ఆల్కెమ్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కేపీఐటీ టెక్, వారీ ఎనర్జీస్, డాబర్ ఇండియా, ప్రెస్టేజ్ ఎస్టేట్, ప్రీమియర్ ఎనర్జీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 152 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..