Share News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఒత్తిడిలో దేశీయ సూచీలు..

ABN , Publish Date - Jun 02 , 2026 | 10:04 AM

దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాటలో సాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 4 శాతం ఎగబాకి 95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఒత్తిడిలో దేశీయ సూచీలు..
Indian stock market

దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాటలో సాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా 4 శాతం ఎగబాకి 95 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే సోమవారం నాడు విదేశీ మదుపర్లు రూ.3911 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.14) పతనమైంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (74,267)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఆరంభ నష్టాల నుంచి పైకి వచ్చింది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 194 పాయింట్ల నష్టంతో 74,073 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 71 పాయింట్ల నష్టంతో 23,311 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో ఇన్ఫోసిస్, ఎన్‌ఎమ్‌డీసీ, టీసీఎస్, టాటా ఎలాక్సీ, కేపీఐటీ టెక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఫోర్స్ మోటార్స్, ఎన్‌హెచ్‌పీసీ, రైల్ వికాస్, బజాజ్ ఫైనాన్స్ ఎన్‌టీపీసీ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 230 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 178 పాయింట్ల నష్టంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్


బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 02 , 2026 | 10:07 AM