స్టాక్‌మార్కెట్లపై వార్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు..
ABN , Publish Date - Mar 02 , 2026 | 10:08 AM
ఊహించినట్టుగానే పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి.
ఊహించినట్టుగానే పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం కూడా నెగిటివ్‌గా మారాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ మరింత పతనమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (81,287)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 2700 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి కొద్దిగా తేరుకున్నాయి. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 848 పాయింట్ల నష్టంతో 80,412 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 265 పాయింట్ల నష్టంతో 24,913 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో భారత్ డైనమిక్స్, సోలార్ ఇండస్ట్రీస్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, హిందుస్థాన్ జింక్, కేఈఐ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). లార్సన్, అదానీ గ్రీన్, ఐఓసీ, అదానీ ఎనర్జీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 422 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 579 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.36గా ఉంది.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..