Share News

ఒడిదుడుకుల్లో సూచీలు.. లాభనష్టాలతో దోబూచులాట..

ABN , Publish Date - Jun 29 , 2026 | 09:48 AM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా తాత్కాలిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రూపాయి బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.31) బలపడింది.

ఒడిదుడుకుల్లో సూచీలు.. లాభనష్టాలతో దోబూచులాట..
Stock Market

పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా తాత్కాలిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రూపాయి బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.31) బలపడింది. అంతర్జాతీయ రాజకీయ కారణాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు బ్యాంకింగ్ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (77,100)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 77,070 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా లాభనష్టాలతో దోబూచులాడుతోంది. ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 24,072 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, మోతీలాల్ ఓస్వాల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). పెర్సిస్టెంట్, ఆస్ట్రాల్ లిమిటెడ్, వెర్నోవా టీడీ, వారీ ఎనర్జీస్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 67 పాయింట్ల నష్టంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి.. దాడులు నిలిపివేయాలని ఒప్పందం..

Updated Date - Jun 29 , 2026 | 09:51 AM