Share News

ఒత్తిడిలో బ్యాంకింగ్ సూచీలు.. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్..

ABN , Publish Date - Jul 28 , 2026 | 09:49 AM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను వెనక్కి లాగుతోంది.

ఒత్తిడిలో బ్యాంకింగ్ సూచీలు.. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్..
Stock Market

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను వెనక్కి లాగుతోంది. సోమవారం భారీ లాభాల నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95. 68) బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (76,835)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 76,928 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 24 పాయింట్ల లాభంతో 24,020 వద్ద ఉంది. మళ్లీ 24 వేల మార్క్‌ను దాటింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో కోఫోర్జ్, లోధా డెవలపర్స్, ఎంఫసిస్, పెర్సిస్టెంట్, టీసీఎస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). గాడ్‌ఫ్రే ఫిలిప్స్, సీజీ పవర్, భారత్ ఎలక్ట్రిక్, కోల్ ఇండియా, వెర్నోవా టీడీ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 76 పాయింట్ల లాభంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..


స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 28 , 2026 | 09:50 AM