Share News

ఇండియా-యూకే ట్రేడ్ డీల్.. నష్టాల నుంచి లాభాల్లోకి దేశీయ సూచీలు.

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:49 PM

వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలకు ఇండియా-యూకే ట్రేడ్ డీల్ భారీ బూస్టింగ్ ఇచ్చింది. గత వారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 800 పాయింట్లకు పైన లాభపడ్డాయి.

ఇండియా-యూకే ట్రేడ్ డీల్.. నష్టాల నుంచి లాభాల్లోకి దేశీయ సూచీలు.
Stock Market

వరుస నష్టాలతో సతమతమైన దేశీయ సూచీలకు ఇండియా-యూకే ట్రేడ్ డీల్ భారీ బూస్టింగ్ ఇచ్చింది. గత వారం భారీగా నష్టపోయిన సూచీలు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా లాభపడింది. గత శనివారం భారీ నష్టాలను చవిచూసిన అదానీ గ్రూప్ కంపెనీలు కూడా ఈ రోజు లాభాల బాట పట్టాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త బలపడింది. క్రూడాయిల్ ధరలు కూడా తగ్గడంతో సెనెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (81,537)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 100 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో దాదాపు 500 పాయింట్లు కోల్పోయి 81, 088 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత నష్టాల నుంచి కోలుకుంది. చివరకు సెన్సెక్స్ 319 పాయింట్ల లాభంతో 81,857 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 126 పాయింట్ల లాభంతో 25,175 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో ఎమ్‌సీఎక్స్ ఇండియా, సోనా బీఎల్‌డబ్ల్యూ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, సింజెన్ ఇంటెల్, గోద్రేజ్ కన్జ్యూమర్, నవుమా వెల్త్, ఎమ్ అండ్ ఎమ్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 732 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 338 పాయింట్లు లాభపడింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.72గా ఉంది.


ఇవి కూడా చదవండి..

సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..


చిలుకల మధ్యలో సీతాకోక చిలుక.. 15 సెకెన్లలో ఆ సీతాకోకచిలుకను కనిపెట్టండి..

Updated Date - Jan 27 , 2026 | 03:49 PM