Share News

సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..

ABN , Publish Date - May 26 , 2026 | 04:42 PM

లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది.

సూచీలకు నష్టాలు.. 470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌..
Stock Market

లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (95.68) బలహీనపడడం నెగిటివ్‌గా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్న నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (76,488)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత పైకి వచ్చింది. అయితే చివర్లో అమ్మకాల వల్ల సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,009 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 118 పాయింట్ల నష్టంతో 23,913 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇన్ఫో ఎడ్జ్, అదానీ ఎనర్జీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). కంటైనర్ కార్పొరేషన్, రైల్ వికాస్, కేన్స్ టెక్, టొరెంట్ ఫార్మా, అశోక్ లేలాండ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 332 పాయింట్లు ఆర్జించింది.


ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..


నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 26 , 2026 | 04:43 PM