బలపడుతున్న రూపాయి.. సూచీలకు కొనసాగుతున్న లాభాలు..
ABN , Publish Date - Jun 25 , 2026 | 09:57 AM
బుధవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.28) బలపడడం సూచీలకు సానుకూలంగా మారింది. అలాగే ఇటీవల భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.
బుధవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.28) బలపడడం సూచీలకు సానుకూలంగా మారింది. అలాగే ఇటీవల భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. మరోవైపు అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ అతి త్వరలో కుదరనుందనే సంకేతాలు కూడా పాజిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,991)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 400 పాయిట్ల లాభాలతో మొదలైన సెన్సెక్స్ అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 77,418 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 121 పాయింట్ల లాభంతో 24,143 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో అశోక్ లేలాండ్, ఎమ్ అండ్ ఎమ్, లోథా డెవలపర్స్, ఫోర్స్ మోటార్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). నాల్కో, ఎల్‌ఐసీ ఇండియా, కేఈఐ ఇండస్ట్రీస్, వేదాంతా, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 128 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..