Share News

సూచీలకు భారీ నష్టాలు.. వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్..

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:55 PM

డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత కుంగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు.

సూచీలకు భారీ నష్టాలు.. వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్..
stock market news

ఐటీ రంగంపై ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఐటీ రంగపు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత కుంగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. చివరకు సెనెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (82,294)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 82 వేల దిగువకు కూడా పడిపోయింది. చివరకు 1068 పాయింట్ల నష్టంతో 82,225 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 288 పాయింట్ల నష్టంతో 25,424 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో బంధన్ బ్యాంక్, అదానీ ఎనర్జీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్, హిటాచీ ఎనర్జీ, చోలా ఇన్వెస్ట్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఎల్‌టీఐ మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, కేపీఐటీ టెక్నాలజీస్, పెర్సిస్టెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 189 పాయింట్లు దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.95గా ఉంది.


ఇవి కూడా చదవండి..

మీ చూపునకు పవర్ ఉంటే.. ఈ ఫొటోలో ఎన్వలప్ కవర్ ఎక్కడుందో 15 సెకెన్లలో గుర్తించండి..


భూ కక్ష్యలోకి మరోసారి.. అంతరిక్ష విమానాన్ని రహస్యంగా ప్రవేశపెట్టిన చైనా..

Updated Date - Feb 24 , 2026 | 03:55 PM