సూచీలకు లాభాల జోష్.. 400 పాయింట్ల పైకి సెన్సెక్స్..
ABN , Publish Date - Jun 22 , 2026 | 09:27 AM
స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. జూన్ 19నాటి ట్రేడింగ్‌లో విదేశీ మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది.
స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. జూన్ 19నాటి ట్రేడింగ్‌లో విదేశీ మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం సానుకూలంగా మారింది. అలాగే క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.25) బలపడడం దేశీయ సూచీలలో జోష్ నింపుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,802)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 360 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్ల లాభంతో 77,208 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 122 పాయింట్ల లాభంతో 24,135 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో వోల్టాస్, పీబీ ఫిన్‌టెక్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, సిప్లా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కమిన్స్, వోర్నెవా టీడీ, మదర్సన్, వరుణ్ బేవరేజెస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 261 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..