Share News

సూచీలకు భారీ నష్టాలు.. కారణాలు ఏంటో తెలుసా..

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:54 PM

వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ సూచీలు మంగళవారం మరింత భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐరోపా దేశాలతో అమెరికా ట్రేడ్ వార్‌కు దిగడంతో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి.

సూచీలకు భారీ నష్టాలు.. కారణాలు ఏంటో తెలుసా..
Stock Market

వరుస నష్టాలతో సతమతమవుతున్న దేశీయ సూచీలు మంగళవారం మరింత భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐరోపా దేశాలతో అమెరికా ట్రేడ్ వార్‌కు దిగడంతో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. అలాగే సోమవారం విదేశీ మదుపర్లు 3,262 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేయడం నెగిటివ్‌గా మారింది. డాలర్‌‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం, క్రూడాయిల్ ధరలు పెరగడం, కంపెనీలు వెల్లడిస్తున్న మూడో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం సూచీల నష్టాలకు కారణంగా కనబడుతున్నాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (83,246)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు నష్టాల్లో కొనసాగింది. అయితే మధ్యాహ్నం తర్వాత మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు భారీ నష్టాల వైపు పయనించాయి. చివరకు సెన్సెక్స్ 1,065 పాయింట్ల నష్టంతో 82,180 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 353 పాయింట్ల నష్టంతో 25,232 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌లో హిందుస్థాన్ జింక్, దాల్మియా భారత్, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, గోద్రేజ్ కన్జ్యూమర్ మొదలైన షేర్లు స్వల్ప లాభాలు ఆర్జించాయి (share market news). ఒబెరియా రియాల్టీ, యూపీఎల్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, హవెల్స్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1562 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.97గా ఉంది.


ఇవి కూడా చదవండి..

రీల్స్ కోసం ప్రాణాలనైనా లెక్క చేయం.. ఈ యువకుడి బైక్ స్టంట్ చూస్తే..


మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పావురాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 04:01 PM