Share News

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:57 PM

ఇరాన్ యుద్ధం నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు కోనుగోళ్లకు ఉత్సాహం చూపించారు.

వరుసగా రెండో రోజూ లాభాలే.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
Stock Market

ఇరాన్ యుద్ధం నష్టాల నుంచి సోమవారం కోలుకున్న దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే జోరును ప్రదర్శించాయి. వరుసగా రెండో రోజు కూడా లాభాలతోనే రోజును ముగించాయి. వరుస నష్టాల నేపథ్యంలో చాలా స్టాక్స్ ఆకర్షణీయంగా మారడంతో మదుపర్లు కోనుగోళ్లకు ఉత్సాహం చూపించారు. అలాగే మంగళవారం ఆసియా దేశాల మార్కెట్లు లాభాలు ఆర్జించాయి. మరోవైపు భారత్‌లో చమురు, గ్యాస్ కొరత లేదని కేంద్రం ప్రకటించడం కూడా మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను నింపింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (75,502)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 300 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ లాభాలతోనే రోజును ముగించింది. మధ్యాహ్నం తర్వాత ఒక దశలో నష్టాల బాట పట్టినప్పటికీ తిరిగి కోలుకుంది. చివరకు 567 పాయింట్ల లాభంతో 76,070 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో నాల్కో, సెయిల్, ఎటర్నల్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, టాటా స్టీల్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). పెర్సిస్టెంట్, టాటా ఎలాక్సీ, హిందుస్థాన్ పెట్రో, విప్రో, బంధన్ బ్యాంక్ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 462 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 559 పాయింట్లు ఎగబాకింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 92.37గా ఉంది.


ఇవి కూడా చదవండి..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..


మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 17 , 2026 | 04:14 PM