Stock Market: భారీ నష్టాల నుంచి కాస్త కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:28 AM
గత కొన్ని సెషన్లుగా వరుస నష్టాలనే చూవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు బుధవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అంతర్జాతీయంగా అనుకూల సంకేతాలు, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి.
గత కొన్ని సెషన్లుగా వరుస నష్టాలనే చూవి చూస్తూ వస్తున్న దేశీయ సూచీలు బుధవారం కూడా అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. అయినప్పటికీ ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా అనుకూల సంకేతాలు, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి. ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (83, 627)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరో వంద పాయింట్లు కిందకు దిగింది. అయితే ఆ తర్వాత కాస్త కోలుకుంది. ప్రస్తుతం ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్ల నష్టంతో 83, 471 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 60 పాయింట్ల నష్టంతో 25, 660 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో హిందుస్థాన్ జింక్, వేదాంత, ఆయిల్ ఇండియా, లారస్ ల్యాబ్స్, నాల్కో మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోటక్ మహీంద్రా, కల్యాణ్ జువెల్లర్స్, టాటా ఎలాక్సీ, ప్రెస్టీజ్ ఎస్టేట్, పాలీక్యాబ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 164 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 164 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.14గా ఉంది.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..