Share News

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లోకి జారుకున్న సూచీలు..

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:16 AM

ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం సూచీలకు నెగిటివ్‌గా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్‌మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి.

Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి.. నష్టాల్లోకి జారుకున్న సూచీలు..
Stock Market

సోమవారం చివరి గంటలో లాభపడిన సూచీలు మంగళవారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేదు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఇరాన్‌తో వాణిజ్యం చేస్తున్న దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం నెగిటివ్‌గా మారింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్‌మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).


గత సెషన్ ముగింపు (83, 878)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్ల నష్టంతో 83, 785 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో 25, 759 వద్ద కొనసాగుతోంది (stock market news today).


సెన్సెక్స్‌లో ఎటర్నల్, ఏంజెల్ వన్, ఆయిల్ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, బీఎస్‌ఈ లిమిటెడ్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). గ్లెన్‌మార్క్, లార్సన్, హెచ్‌ఎల్ టెక్, ఇండియన్ రెన్యుబుల్, ఎన్‌హెచ్‌పీసీ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 98 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 130 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 90.24గా ఉంది.


ఇవి కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..


ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఏడాదిలో లక్ష వీసాలు రద్దు..

Updated Date - Jan 13 , 2026 | 11:33 AM