ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:12 PM
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలను వెనక్కి లాగాయి. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.27)గా ఉంది.
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలను వెనక్కి లాగాయి. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.27గా ఉంది. అలాగే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 0.5 శాతం పెరిగి 92 డాలర్లకు చేరుకుంది. మంగళవారం 4566 కోట్ల విలువైన షేర్లను విదేశీ మదుపర్లు విక్రయించారు. ఈ ప్రతికూలతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభ లాభాలను కోల్పోయాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (73,918)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకుంది. చివరకు సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 73,983 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది. 27 పాయింట్ల నష్టంతో 23,214 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో నెస్ట్లే, శ్రీ సిమెంట్స్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఆయిల్ ఇండియా, మణప్పురం ఫైనాన్స్, భెల్, ఇండియన్ బ్యాంక్, కల్యాణ్ జువెల్లర్స్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 905 పాయింట్లు నష్టపోయింది.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..