Share News

రూపాయి విలవిల..చమురు సలసల

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:45 AM

డాలర్‌తో రూపాయి మారకం రేటు పల్టీలు కొడుతోంది. సోమవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 6 పైసలు క్షీణించి రూ.96.36 వద్ద ముగిసింది. ఫారెక్స్‌..

రూపాయి విలవిల..చమురు సలసల

రెండు నెలల కనిష్ఠానికి రూపాయి

న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం రేటు పల్టీలు కొడుతోంది. సోమవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 6 పైసలు క్షీణించి రూ.96.36 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో సోమవారం ఆరంభంలో 96.53 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో రూ.96.35-96.53 మధ్య ట్రేడైంది. గత రెండు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. చివరికి 6 పైసల నష్టంతో రూ.96.36 వద్ద ముగిసింది. కాగా వచ్చే కొద్ది రోజుల్లో డాలర్‌తో రూపాయి రూ.96.10 -96.70 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. అమెరికా-ఇరాన్‌ మధ్య ముదిరిన యుద్ధం, మళ్లీ పెరుగుతున్న చమురు ధర ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్‌ ముడి చమురు సోమవారం ఏకంగా 2.69 శాతం పెరిగి 90.47 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో హోర్ముజ్‌ జలసంధి మళ్లీ మూసుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 05:45 AM