Share News

బయోలాజికల్స్‌దే భవిష్యత్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:25 AM

జెనరిక్‌ ఔషధాలతో ప్రపంచానికి తమ సత్తా చాటిన భారత ఔషధ కంపెనీలు ఇక సరికొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై దృష్టి పెట్టాలని బయో ఏషియా 2026 సదస్సులో...

బయోలాజికల్స్‌దే భవిష్యత్‌

హై వాల్యూ ఔషధాలపై దృష్టి పెట్టాలి

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వైస్‌ చైర్మన్‌ జీవీ ప్రసాద్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జెనరిక్‌ ఔషధాలతో ప్రపంచానికి తమ సత్తా చాటిన భారత ఔషధ కంపెనీలు ఇక సరికొత్త ఔషధాల పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)పై దృష్టి పెట్టాలని బయో ఏషియా- 2026 సదస్సులో ప్రసంగించిన దేశీయ ఫార్మా కంపెనీల సీఈఓలు కోరారు. ఇందుకు అధిక సమయం పట్టినా, అందుకు అవసరమైన కృషి ఇప్పటి నుంచే ప్రారంభం కావాలన్నారు. దీనివల్ల అధిక విలువతో కూడిన సరికొత్త ఔషధాల అభివృద్ధి సాధ్యమవుతుందని ‘సీఈఓ కాంక్లేవ్‌’లో స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పెట్టుబడులు సమీకరించడం కష్టమైనా, వెంచర్‌ క్యాపిటలిస్టుల నుంచి సమకూర్చుకోవచ్చని సూచించారు. ‘జెనరిక్‌ ఔషధాల ఎగుమతికి మన దేశం ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రధాన శక్తి. అయితే ఔషధాల అసలు విలువ సరికొత్త ఔషధాల అభివృద్ధిలో ఉంటుంది. భవిష్యత్‌ అంతా బయోలాజికల్స్‌, సేవల్లోనే ఉంటుంది’ అని చర్చలో పాల్గొన్న డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వైస్‌ చైర్మన్‌ జీవీ ప్రసాద్‌ స్పష్టం చేశారు. దేశంలో ఏర్పాటవుతున్న జీసీసీలతో సరికొత్త ఔషధాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. చర్చలో పాల్గొన్న బయోకాన్‌ బయోలాజిక్స్‌ ఎండీ, సీఈఓ శ్రీహాస్‌ తాంబే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 18 , 2026 | 02:25 AM