స్విస్ బ్యాంకుల్లో తగ్గిన భారతీయుల నిధులు
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:48 AM
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుముఖం పట్టాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ) అందించిన తాజా వివరాలే ఇందుకు...
న్యూఢిల్లీ/జ్యూరిక్: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు తగ్గుముఖం పట్టాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బీ) అందించిన తాజా వివరాలే ఇందుకు ఉదాహరణ. గత ఏడాది (2025) డిసెంబరు నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నిధుల మొత్తం 325 కోట్ల స్విస్ ఫ్రాంకులు (సుమారు రూ.36,793 కోట్లు) మాత్రమే. 2024తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువని ఎస్‌ఎన్‌బీ తెలిపింది. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత, సంస్థాగత ఖాతాదారుల ఖాతాల్లోని నిధులు మాత్రం 50 శాతానికిపైగా పెరిగి 52.4 కోట్ల స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ.6,000 కోట్లు) చేరాయి. స్విస్ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న మొత్తం సొమ్ములో ఇది కేవలం 16 శాతం మాత్రమేనని ఎస్‌ఎన్‌బీ తెలిపింది. ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో భారతీయులకు ఉన్న నిధుల్లో మెజారిటీ నిధులు ‘బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం’ లేదా ‘ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా డిపాజిట్ చేసిన మొత్తాల’ రూపంలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. విమాన సర్వీసులకు అంతరాయం
ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే వడ్డీ జమ..