భారతీయుల ప్రతిభకు పట్టం
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:42 AM
భారతీయుల ప్రతిభకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ లు పట్టం కడుతున్నాయి. వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా నియామకంతో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన...
భారతీయుల ప్రతిభకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ లు పట్టం కడుతున్నాయి. వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా నియామకంతో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న భారతీయ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే భారత సంతతికి చెందిన ఆశా శర్మ మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈఓగా నియమితులయ్యారు. గత ఏడాది అక్టోబరులో ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా రాహుల్ పాటిల్ నియమితులయ్యారు. అంతకు ముందు 2023 లో యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్, కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ ఎస్ నియమితులయ్యారు. సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా, 2015లో గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యతలు చేపట్టారు. 2007 నుంచి అడోబ్‌కు శంతనూ నారాయణ్ సారథ్యం వహిస్తున్నారు. అలాగే ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం దిగుమతులు 70 శాతం డౌన్