Share News

భారత కంపెనీల అమెరికా బాట

ABN , Publish Date - May 07 , 2026 | 06:24 AM

భారత కంపెనీలు అమెరికా బాట పడుతున్నాయి. అగ్రరాజ్యంలో 2,050 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. టెక్నాలజీ, తయారీ,...

భారత కంపెనీల అమెరికా బాట

రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధం

సెలెక్ట్‌ యూఎ్‌సఏ ఇన్వె్‌స్టమెంట్‌సమ్మిట్‌లో

రూ.10,450 కోట్ల పెట్టుబడులు

ప్రకటించిన 12 కంపెనీలు

వాషింగ్టన్‌: భారత కంపెనీలు అమెరికా బాట పడుతున్నాయి. అగ్రరాజ్యంలో 2,050 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. టెక్నాలజీ, తయారీ, ఫార్మాసూటికల్స్‌ వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి. మేరీలాండ్‌లోని నేషనల్‌ హార్బర్‌లో మంగళవారం జరిగిన సెలెక్ట్‌ యూఎ్‌సఏ ఇన్వె్‌స్టమెంట్‌ సమ్మిట్‌లో 110 కోట్ల డాలర్ల (రూ.10,450 కోట్లు) విలువైన ప్రాజెక్టులను 12 భారత కంపెనీలు ప్రకటించాయి. ఫార్మాసూటికల్స్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వంటి రంగాల్లో పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాల కల్పనకే కాకుండా సరఫరా వ్యవస్థ బలోపేతానికి, అమెరికా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలకు అవకాశం ఏర్పడనుంది. ప్రతిపాదిత పెట్టుబడుల్లో 1,910 కోట్ల డాలర్లు (రూ.1.81 లక్షల కోట్లు) ఫార్మా కంపెనీలవే. న్యూజెర్సీకి చెందిన ఆర్గనాన్‌ అండ్‌ కో ను 1,175 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయబోతున్నట్లు ఈమధ్యనే సన్‌ఫార్మా ప్రకటించిన డీల్‌ కూడా ఇందులో భాగమే. కాగా, ఓహియో, టెక్సా్‌సలోని తన ప్లాంట్ల ఆధునికీకరణ కోసం జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ 25.5 కోట్ల డాలర్లు వెచ్చించనుంది.

భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ బుధవారం అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు అగ్రదేశానికి తిరిగి వస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ గెలుస్తార నడానికి ఇదే నిదర్శనం అన్నారు. డజను భారత కంపెనీల పెట్టుబడి ప్రకటనలపై అమెరికా వాణిజ్య శాఖ (అంతర్జాతీయ వాణిజ్యం) అండర్‌ సెక్రటరీ విలియం కిమిట్‌ మాట్లాడుతూ.. సెలెక్ట్‌ యూఎ్‌సఏలో ఒక దేశం నుంచి వెలువడిన అత్యధిక పెట్టుబడి ప్రకటనలు ఇవేనన్నారు. ఈ పెట్టుబడులు అమెరికాలో ప్రత్యక్షంగా దాదాపు 2,500 ఉద్యోగాల సృష్టికి దోహదపడనున్నాయి. సదస్సలో పెట్టుబడులు ప్రకటించిన కంపెనీల జాబితాలో అహ్మదాబాద్‌కు చెందిన అభ్యుదయ్‌ గ్రూప్‌, ముంబైకి చెందిన స్టెర్‌లైట్‌ టెక్నాలజీస్‌, ఢిల్లీకి చెందిన జివో వెల్‌నెస్‌ గ్రూప్‌, పీఆర్‌ జిందాల్‌ గ్రూప్‌, ఇండోర్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ టెక్‌డోమ్‌ సొల్యూషన్స్‌, చెన్నైకి చెందిన అట్రి ఏఐ, సటోరి ఎక్స్‌ఆర్‌ టీమ్‌, బీ2బీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కిస్‌ఫో, కేరళకు చెందిన మాగ్నో ఇన్నోవేషన్‌, రోషె ఏఐతోపాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మద్రాస్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, పాలిహోస్‌ ఇంక్‌ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా

Updated Date - May 07 , 2026 | 06:24 AM