ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుంటాం..
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:09 AM
కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా అందివచ్చే వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోవడానికి భారత కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి...
టెక్ కంపెనీల వెల్లడి: రాండ్‌స్టడ్
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా అందివచ్చే వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోవడానికి భారత కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఏఐతో సేవలను విస్తరించడానికి, కొత్త ఆదాయాన్ని ఆర్జించడానికి 90ు భారత కంపెనీలు తమ టెక్నాలజీ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఈ విషయంలో అమెరికా (93ు) తర్వాత భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ సగటు 86 శాతంగా ఉంది. ఈ వివరాలను టాలెంట్ కంపెనీ రాండ్‌స్టడ్ గ్లోబల్ నివేదిక వెల్లడించింది. అమెరికా, ఆస్ర్టేలియా, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, స్పెయిన్, యూకేల్లో ఈ ఏడాది ఆగస్టు ప్రథమార్ధంలో నిర్వహించిన పరిశోధన ఆధారంగా దీన్ని రూపొందించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్