జీవిత బీమా, అసెట్ మేనేజ్‌మెంట్‌లోకి ఇండియన్ బ్యాంక్
ABN , Publish Date - Sep 14 , 2026 | 03:05 AM
జీవిత బీమా, అసెట్ మేనేజ్‌మెంట్ రంగాల్లోకి ఇండియన్ బ్యాంక్ ప్రవేశించే ప్రయత్నాలు అనుకున్నట్టుగానే ముందుకు...
త్వరలో బోర్డు ఆమోదం పొందే చాన్స్
న్యూఢిల్లీ: జీవిత బీమా, అసెట్ మేనేజ్‌మెంట్ రంగాల్లోకి ఇండియన్ బ్యాంక్ ప్రవేశించే ప్రయత్నాలు అనుకున్నట్టుగానే ముందుకు సాగుతున్నాయని, త్వరలోనే ఇందుకు సంబంధించి బోర్డు ఆమోదం కోరనున్నట్టు ఆ బ్యాంక్ ఎండీ, సీఈఓ బినోద్ కుమార్ తెలిపారు. అనంతరం అవసరమైన నియంత్రణ, పరిపాలనా ప్రక్రియలను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రతిపాదిత అనుబంధ సంస్థలు లేదా జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు సంబంధించి బోర్డు ఆమోదం పొందే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. సరైన భాగస్వామిని ఎంచుకోవడం కీలకమని, బలమైన భాగస్వామి.. సంపద సృష్టిని వేగవంతం చేయడానికి దోహదపడతారని పేర్కొన్నారు. యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 28.52ు వాటాతో ఇప్పటికే జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఇండియన్ బ్యాంకు ఉనికిని కలిగి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు
ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!