Share News

భారత విమానయాన రంగంలో ఎంఎస్‌ఎంఈలకు అపార అవకాశాలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:11 AM

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) భారత విమానయాన రంగం అపార అవకాశాలను అందిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు...

భారత విమానయాన రంగంలో ఎంఎస్‌ఎంఈలకు అపార అవకాశాలు

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎ్‌సఎంఈ) భారత విమానయాన రంగం అపార అవకాశాలను అందిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ ఏరోస్పేస్‌ మార్కె ట్లో మరింతగా భారతీయ సరఫరాదారులను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పా రు. గురువారం నాడిక్కడ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన సదస్సులో రామ్మోహన్‌ నాయుడు మాట్లాడారు. భారత్‌ ఏరోస్పేస్‌ విడిభాగాల అసెంబ్లింగ్‌ ప్రదేశంగా ఉండటం మాత్రమే కాకుండా విడిభాగాల రూపకల్పన, ధ్రువీకరణ, తయారీ ప్రదేశంగానూ ఉండాలన్నారు. సదస్సులో పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్‌ కుమార్‌ సిన్హా మాట్లాడుతూ.. దేశంలో విమానాల తయారీకి సంబంధించిన వివిధ మోడళ్లను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా తమ కంపెనీ ఏటా భారత్‌ నుంచి దాదాపు రూ.14,000 కోట్ల విలువైన ఉత్పత్తులు, సర్వీసులను పొందుతోందని బోయింగ్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌ సలీల్‌ గుప్తే చెప్పారు. బోయింగ్‌కు భారత్‌లో దాదాపు 300 మంది సరఫరాదారులుండగా..ఇందులో 25 శాతం ఎంఎ్‌సఎంఈలే కావడం గమనార్హం.

స్పైస్‌జెట్‌పై దృష్టి పెట్టాం..

బడ్జెట్‌ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ఆర్థిక స్థితిగతులతో పాటు కార్యకలాపాలను ప్రభుత్వం, విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ నిశితంగా పరిశీలిస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ తెలిపారు. ఈ సంస్థ నడుపుతున్న విమానాల సంఖ్యతో పా టు దేశీయ మార్కెట్లో వాటా కూడా భారీగా తగ్గింది. దీంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుండటంతో పాటు సిబ్బందికి సకాలంలో జీతాలను సంస్థ చెల్లించలేకపోతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 05:11 AM