రూ.104 లక్షల కోట్లు
ABN , Publish Date - Jul 30 , 2026 | 03:42 AM
దేశంలోని సంపద సృష్టికర్తలకు సంబంధించి ప్రముఖ వెల్త్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘360 వన్’ బుధవారం ఓ జాబితాను విడుదల చేసింది. దేశంలో కనీసం రూ.425 కోట్ల వ్యక్తిగత...
దేశంలోని 3,040 మంది సంపద సృష్టికర్తల మొత్తం ఆస్తి ఇది..
మన జీడీపీలో 30 శాతానికి సమానమిది..
టాప్ 10 వ్యక్తుల వద్దే 19 శాతం నెట్‌వర్త్
360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ విడుదల
న్యూఢిల్లీ: దేశంలోని సంపద సృష్టికర్తలకు సంబంధించి ప్రముఖ వెల్త్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘360 వన్’ బుధవారం ఓ జాబితాను విడుదల చేసింది. దేశంలో కనీసం రూ.425 కోట్ల వ్యక్తిగత సంపదతో కూడిన వ్యక్తులు 3,040 మంది ఉన్నారని.. వారి మొత్తం ఆస్తి రూ.104 లక్షల కోట్లని తెలిపింది. ఇది భారత నామినల్ జీడీపీలో 30 శాతానికి సమానమని, దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పరిమాణానికి దాదాపు 1.2 రెట్లని వెల్లడించింది. ‘360 వన్ వెల్త్ క్రియేటర్స్ లిస్ట్ 2026’లోని మరిన్ని ముఖ్యాంశాలు..
ఈ జాబితాలోని మొదటి 3 స్థానాలు ముకేశ్ అంబానీ వారసులు అనంత్, ఇశా, ఆకాశ్ అంబానీలవే. ఒక్కొక్కరూ రూ.2.75లక్షల కోట్లకుపైగా ఆస్తి కలిగి ఉన్నారు.
మొత్తం సంపదలో 19 శాతం టాప్-10 ధనికుల వద్దే కేంద్రీకృతమై ఉంది.
ఆర్థిక రాజధాని ముంబై సంపద సృష్టికర్తల అడ్డాగా ఉంది. ఈ నగరం నుంచి 802 మందికి జాబితాలో చోటు దక్కింది. రూ.104 లక్షల కోట్లలో వీరి వాటాయే 38.4 శాతంగా ఉంది.
జాబితాలో అత్యధికంగా 1,696 మంది తొలి తరం పారిశ్రామికవేత్తలే కాగా.. వారసత్వంగా సంపద అందుకున్న వారు 1,290 మంది ఉన్నారు.
లిస్ట్‌లో 738 మంది మహిళలున్నారు. మొత్తం సంపదలో వీరి వాటా 22.6 శాతంగా ఉంది. దేశంలోని 183 మంది బిలియనీర్ల (కనీసం రూ.9,500 కోట్లకుపైగా ఆస్తి కలిగినవారు)లో 47 మంది మహిళలే.
జాబితాలోని వ్యక్తుల వయసు 7 ఏళ్ల నుంచి 96 ఏళ్ల శ్రేణిలో ఉంది. కాగా, సగటు వయసు 57.
ఈ జాబితాలో బడా వ్యాపార సామ్రాజ్యాలకు చెందిన వ్యక్తులదే ఆధిపత్యం. మొత్తం సంపదలో దిగ్గజ గ్రూప్‌లకు చెందిన 30 మంది వాటా 14.6 శాతంగా ఉంది.
టాప్ 100 కుటుంబాల జాబితాను కూడా విడుదల చేసిందీ సంస్థ. వీరి మొత్తం సంపద రూ.76.5 లక్షల కోట్లు. అందులో టాప్-10 కుటుంబాల వాటాయే 49 శాతంగా ఉంది. రూ.9.08 లక్షల కోట్ల ఆస్తితో అదానీ కుటుంబం అగ్రస్థానంలో ఉంది.
రూ.1000 కోట్లకు పైగా ఆస్తి కలిగిన టాప్-10 వ్యక్తులు
పేరు సంపద కంపెనీ
(రూ.కోట్లు)
అనంత్ ముకేశ్ అంబానీ 2,80,642 రిలయన్స్ ఇండస్ట్రీస్
ఇశా అంబానీ 2,77,402 రిలయన్స్ ఇండస్ట్రీస్
ఆకాశ్ ముకేశ్ అంబానీ 2,77,034 రిలయన్స్ ఇండస్ట్రీస్
దిలీప్ సంఘ్వీ 2,20,543 సన్ ఫార్మా
గౌతమ్ అదానీ 1,96,179 అదానీ గ్రూప్
రాజేశ్ అదానీ 1,73,582 అదానీ గ్రూప్
అజీమ్ ప్రేమ్‌జీ 1,45,937 విప్రో
వినోద్ అదానీ 1,45,582 అదానీ గ్రూప్
అనిల్ అగర్వాల్ 1,44,365 వేదాంత
షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ 1,10,390 ఎస్‌పీ గ్రూప్
హైదరాబాద్‌లోని టాప్ 10 వ్యక్తులు
నీలిమ ప్రసాద్ దివి 34,017 దివీస్ ల్యాబ్స్
శరత్‌చంద్ర కిరణ్ దివి 34,017 దివీస్ ల్యాబ్స్
అయోధ్య రామిరెడ్డి 31,164 రాంకీ గ్రూప్
పినాక సునీల రాణి 28,004 అరబిందో ఫార్మా
ఇషాన్ 27,597 రాంకీ గ్రూప్
చిరంజీవ్ సింగ్ సలూజా 23,148 ప్రీమియర్ ఎనర్జీస్
పీవీ కృష్ణా రెడ్డి 20,442 మేఘా ఇంజనీరింగ్
పీపీ రెడ్డి 19,673 మేఘా ఇంజనీరింగ్
కే సతీశ్ రెడ్డి 16,153 డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
జీవీ ప్రసాద్ 15,506 డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
ఇవి కూడా చదవండి
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు బాక్సర్లు సాక్షి, అరుంధతి.. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం!
విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా