టాఫీ ఎగుమతుల్లో 166 శాతం వృద్ధి
ABN , Publish Date - May 21 , 2026 | 02:05 AM
భారత టాఫీ (మిఠాయి) ఎగుమతులు గత పన్నెండేళ్లలో ఏకంగా 166 శాతం పెరిగాయి. 2013-14 ఆర్థిక సంత్సరంలో రూ. 49.68 కోట్లుగా ఉన్న ఈ ఎగుమతుల విలువ...
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ : భారత టాఫీ (మిఠాయి) ఎగుమతులు గత పన్నెండేళ్లలో ఏకంగా 166 శాతం పెరిగాయి. 2013-14 ఆర్థిక సంత్సరంలో రూ. 49.68 కోట్లుగా ఉన్న ఈ ఎగుమతుల విలువ 2025-26 నాటికి రూ.132 కోట్లకు చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పరిమాణం పరంగా ఈ పుష్కర కాలంలో ఎగుమతులు 10.6 శాతం పెరిగి 6,652 టన్నుల నుంచి 7,357 టన్నులకు చేరుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ భారత్‌కు చెందిన ఎంతో అద్భుతమైన, రుచికరమైన ‘మెలోడీ’ టాఫీలను తమకు బహుమతిగా ఇచ్చారని పేర్కొంటూ ఇటలీ ప్రధాని మెలోని సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలపడంతో..టాఫీల ఎగుమతుల గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ.