Share News

స్టార్టప్‌ ఇండియా సరికొత్త రికార్డు

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:29 AM

భారత స్టార్టప్‌ రంగం చారిత్రాత్మక వృద్ధిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 55,200లకు పైగా కొత్త సంస్థలు.. స్టార్ట్‌ప్సగా ప్రభుత్వ గుర్తింపు పొందాయి....

స్టార్టప్‌ ఇండియా సరికొత్త రికార్డు

2025-26లో 55,200 కొత్త సంస్థలకు స్టార్ట్‌ప్సగా గుర్తింపు

న్యూఢిల్లీ: భారత స్టార్టప్‌ రంగం చారిత్రాత్మక వృద్ధిని నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 55,200లకు పైగా కొత్త సంస్థలు.. స్టార్ట్‌ప్సగా ప్రభుత్వ గుర్తింపు పొందాయి. 2016లో ‘స్టార్టప్‌ ఇండియా’ కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఒకే ఏడాదిలో ఇంత భారీ సంఖ్యలో గుర్తింపు లభించడం ఇదే తొలిసారి అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు గుర్తింపు పొందిన మొత్తం అంకుర సంస్థల సంఖ్య 2.23 లక్షలు దాటింది. వీటి ద్వారా 23.36 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడం విశేషం. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాకాలు, పన్ను రాయితీలు, సులభతర వాణిజ్య విధానాలు ఈ విజయానికి తోడ్పాటునందించాయి. ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌ఎ్‌ఫఎస్‌) కింద ప్రభ్వుతం గత ఆర్థిక సంవత్సరంలో 135 ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎ్‌ఫ)కు రూ.7,000 కోట్లు మంజూరు చేసింది. ఈ సంస్థలు 1,420కి పైగా స్టార్ట్‌ప్సలో దాదాపు రూ.26,900 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు ప్రభుత్వం రూ.10,000 కోట్ల కార్ప్‌సతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ 2.0ను కూడా ప్రకటించింది. క్రెడిట్‌ గ్యారెంటీ పరిమితిని రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచింది. అలాగే ‘సీడ్‌ ఫండ్‌’ పఽథకం ద్వారా 3,400 అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు లభించింది. ప్రతిఫలంగా పేటెంట్‌ ఫైలింగ్స్‌ సంఖ్య ఏడాదిలోనే 2,850 నుంచి 4,480కి పైగా పెరగడం విశేషం.

ఇవి కూడా చదవండి:

డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు జరిమానా విధించిన బీసీసీఐ

గుజరాత్‌పై వరుణ్ చక్రవర్తి విజృంభణ చూస్తాం: కార్తిక్ త్యాగి

Updated Date - Apr 18 , 2026 | 04:29 AM