Share News

రికార్డు స్థాయిలో మత్స్య ఎగుమతులు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:27 AM

అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరం (2025-26) మన సముద్ర మత్స్య ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి....

రికార్డు స్థాయిలో మత్స్య ఎగుమతులు

2025-26లో రూ.73,325 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరం (2025-26) మన సముద్ర మత్స్య ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో 828 కోట్ల డాలర్ల (సుమారు రూ.72,325 కోట్లు) విలువైన 19.32 లక్షల టన్నుల సముద్ర మత్స్య ఎగుమతులు జరిగినట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 11.2 శాతం ఎక్కువ. ఇందులో రొయ్యల వాటానే 551 కోట్ల డాలర్ల (సుమారు రూ.47,973 కోట్లు) వరకు ఉంది. విలువపరంగా చూస్తే రొయ్యల ఎగుమతులు 6.35 శాతం, పరిమాణపరంగా 4.6 శాతం పెరిగాయి. అమెరికాకు జరిగే మత్స్య ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం తగ్గుముఖం పట్టినా యూరప్‌, చైనా మార్కెట్లు ఆదుకున్నాయి.

  • ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.6,723.73 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.1,110.9 కోట్ల నికరలాభం ఆర్జించింది. ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.873.46 కోట్లతో పోల్చితే లాభం 27.18% పెరిగింది. మొత్తం ఆదాయం 22.73ు వృద్ధితో రూ.6,766.24 కోట్లకు చేరింది.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 22 , 2026 | 05:27 AM