చైనా ఎఫ్‌డీఐపై ప్రభుత్వం పునరాలోచన
ABN , Publish Date - May 01 , 2026 | 04:48 AM
చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. విదేశీ కంపెనీల ఈక్విటీలో చైనా...
త్వరలోనే నోటిఫికేషన్ జారీ!
న్యూఢిల్లీ: చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. విదేశీ కంపెనీల ఈక్విటీలో చైనా పెట్టుబడులు 10 శాతానికి మించకుండా ఉండే కంపెనీల నుంచి వచ్చే పెట్టుబడులను విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయను న్నట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ జై ప్రకాశ్ శివహరే చెప్పారు. అయితే ఈ వెసులుబాటు చైనా, హాంకాంగ్‌తో పాటు భారత్‌లో భూసరిహద్దు పంచుకుంటున్న దేశాల్లో నమోదైన చైనా కంపెనీలకు మాత్రం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఏయే సబ్ సెక్టార్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన రెండు నెలల్లో పూర్తి చేయాలనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. కొన్ని కీలక రంగాల్లో చైనా ఎఫ్‌డీఐపై కఠిన వైఖరి ఏ మాత్రం మంచిది కాదని పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం దీనిపై మెత్తబడినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు