ధరలు భగభగ!
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:54 AM
ఈ ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి. ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాల ధరల్లో...
ఆగస్టులో 4.82 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం
9.92 శాతానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: ఈ ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి. ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల కారణంగా ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి ఎగబాకింది. జూలైలో ఇది 4.45 శాతంగా ఉంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో 9.92 శాతానికి పెరిగింది. ఆహార, ఇంధన, విద్యుత్‌తోపాటు తయారైన ఉత్పత్తుల ధరల్లో పెరుగుదల ఇందుకు కారణం. జూలైలో ఇది 9.78 శాతంగా ఉన్నట్టు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. 2024 ఆధార సంవత్సరంతో జనవరి నుంచి కొత్త సిరీస్ అమల్లోకి రాగా అప్పటి నుంచి ఆగస్టులోనే అధికంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది.
తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం
ఈ ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో అత్యధికంగా 6.27 శాతంగా నమోదైంది. అతి తక్కువగా మిజోరాంలో 2.35 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News