Share News

ఎండలే కాదు ధరలూ గరం!

ABN , Publish Date - May 13 , 2026 | 02:15 AM

ఈ ఏప్రిల్‌లో ఎండలే కాదూ.. మార్కెట్లో ధరలూ గణనీయంగా పెరిగాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గతనెలలో 3.48 శాతానికి ఎగబాకింది. ఇది...

ఎండలే కాదు ధరలూ గరం!

  • ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

  • బంగారు, వెండి ఆభరణాలు, ఆహారోత్పత్తుల

రేట్లు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం

న్యూఢిల్లీ: ఈ ఏప్రిల్‌లో ఎండలే కాదూ.. మార్కెట్లో ధరలూ గణనీయంగా పెరిగాయి. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గతనెలలో 3.48 శాతానికి ఎగబాకింది. ఇది 13 నెలల గరిష్ఠ స్థాయి. అంతేకాదు, వరుసగా ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. బంగారం, వెండి ఆఽభరణాలతో పాటు కూరగాయలు, ఇతర ఆహారోత్పత్తుల రేట్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 2024 ఆధార సంవత్సరంగా గణించిన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ మార్చిలో 3.40 శాతం, ఫిబ్రవరిలో 3.21 శాతం, జనవరిలో 2.74 శాతంగా నమోదైంది.

ఆహార ధరల సూచీ 4.20 శాతానికి: కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ మార్చిలో 3.87 శాతంగా నమోదైన ఆహార ధరల సూచీ ఏప్రిల్‌లో 4.20 శాతానికి ఎగబాకింది. ఈ జనవరిలో నమోదైన 2.13 శాతంతో పోలిస్తే రెండింతలైంది. గత నెలలో కొబ్బరి కుడుకల ధర అత్యధికంగా 44.55 శాతం పెరగగా.. టమాటో 35.28 శాతం, కాలీఫ్లవర్‌ 25.58 శాతం ప్రియమయ్యాయి. కాగా, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, మోటార్‌ కార్‌, జీప్‌, బఠానీలు, ఏసీల ధరల్లో మాత్రం తగ్గుదల నమోదైంది.

నగ.. భగ భగ : గత నెలలో వెండి ఆభరణాల ధరలు వార్షిక ప్రాతిపదికన 144.34 శాతం ఎగబాకగా.. గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినమ్‌ జువెలరీ రేట్లు 40.72 శాతం పెరిగాయి.

తెలంగాణలో అధికం: ఏప్రిల్‌లో గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం 3.74 శాతంగా, పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణం 3.16 శాతంగా నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే, అత్యధికంగా తెలంగాణలో 5.81 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 4.2 శాతం, అత్యల్పంగా మిజోరాంలో 0.69 శాతంగా ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం

అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత

Updated Date - May 13 , 2026 | 02:15 AM