25 శాతం తగ్గిన ఎయిర్‌పోర్ట్ చార్జీలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:02 AM
ఇంధన భారంతో కుదేలవుతున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చిన్న ఊరట ప్రకటించింది. విమానాల ల్యాండింగ్, పార్కింగ్ కోసం...
న్యూఢిల్లీ: ఇంధన భారంతో కుదేలవుతున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం చిన్న ఊరట ప్రకటించింది. విమానాల ల్యాండింగ్, పార్కింగ్ కోసం విమానాశ్రయాల్లో వసూలు చేసే చార్జీలను 25 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడు నెలల పాటు ఈ తగ్గింపు అమల్లో ఉంటుంది. దీనివల్ల విమానాశ్రయాల నిర్వాహకులకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని తదుపరి చార్జీల సవరణలో భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మూడు నెలల పాటు విమానయాన సంస్థలకు రూ.400 కోట్లు ఆదా అవుతాయని అంచనా.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..