Share News

ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌కు పన్ను ఊరట

ABN , Publish Date - Aug 04 , 2026 | 05:14 AM

భారత్‌ను గ్లోబల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆఫ్‌షోర్‌ ఫండ్లు (అర్హత కలిగిన..

ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌కు పన్ను ఊరట

  • పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లును

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: భారత్‌ను గ్లోబల్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆఫ్‌షోర్‌ ఫండ్లు (అర్హత కలిగిన పెట్టుబడి ఫండ్లు- ఈఐఎఫ్‌) తమ ప్రపంచవ్యాప్త ఆదాయంపై పన్ను మినహాయింపు పొందేందుకు అర్హత నిబంధనలను సడలించాలని కేంద్రం ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026 ప్రకారం.. ఈఐఎ్‌ఫలు అంతర్జాతీయంగా గడించిన ఆదాయంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న ఆంక్షలు, పరిమితులను ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. అవి ఏంటంటే..?

  • ఫండ్‌లో కనీసం 25 మంది ఇన్వెస్టర్లు ఉండాలి.

  • ఫండ్‌లో ఒక్కో ఇన్వెస్టరు వాటా 10 శాతానికి మించరాదు.

  • ఫండ్‌ కార్ప్‌సలో 25 శాతానికి మించి ఏదైనా ఒక సంస్థలో పెట్టుబడిగా పెట్టరాదు.

  • అనుబంధ సంస్థల్లో పెట్టుబడులపై ఆంక్షలు.

  • కనీస నెలవారీ సగటు కార్పస్‌ రూ.100 కోట్లుగా ఉండాలి.

ఇక అందరికీ ఒకే మినహాయింపు నిబంధనలు

గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సెంటర్‌ (ఐఎ్‌ఫఎ్‌ససీ) నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫండ్స్‌కు ప్రత్యేక మినహాయింపు నిబంధనలను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. దాంతో ఐఎ్‌ఫఎ్‌ససీ, ఐఎ్‌ఫఎ్‌ససీ యేతర ఫండ్ల మధ్య నెలకొన్న అస్పష్టత తొలగిపోనుంది. అంటే, ఇకపై భారత్‌లో ఎక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించే ఫండ్స్‌కైనా తమ గ్లోబల్‌ రెవెన్యూపై పన్ను మినహాయింపు కోసం ఏకరీతి అర్హత నిబంధనలు వర్తించనున్నాయి.


బిల్లులోని మరిన్ని విషయాలు..

  • విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ).. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులపై గడించిన లాభాలపై మూలధన లాభాల పన్నుతో పాటు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పించేందుకు ఈ జూన్‌ 5న జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఈ బిల్లు భర్తీ చేయనుంది.

  • కస్టమ్స్‌ బంధిత ప్రాంతాల్లో ఎలకా్ట్రనిక్‌ పరికరాల నిల్వ, విక్రయాలు సాగించడంతో పాటు భారత తయారీదారులకు సరఫరా చేస్తున్న విదేశీ తయారీదారులకు సైతం పన్ను మినహాయింపు కల్పించాలని బిల్లు ప్రతిపాదించింది.

  • దేశీయ సెజ్‌ల ద్వారా ముడి వజ్రాల వర్తకంపై ఆదాయం గడిస్తున్న విదేశీ సంస్థలకు కూడా 2041 మార్చి 31 వరకు పన్ను మినహాయింపు కల్పించాలని బిల్లు ప్రతిపాదించింది.

ఇవి కూడా చదవండి:

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 04 , 2026 | 05:14 AM