Share News

2030 నాటికి 1.9 ట్రిలియన్ డాలర్లకు భారత ప్రైవేట్ వినియోగ రంగం!

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:01 PM

భారత్‌లో ప్రైవేట్ వినియోగం 2030 నాటికి రూ. 165 లక్షల కోట్లకు పైగా చేరుకోనుందని FICCI- డెలాయిట్ సంయుక్త నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న ప్రజల తలసరి ఆదాయం, శరవేగంగా జరుగుతున్న డిజిటల్ మార్పుల విప్లవంతో ఇది సాధ్యమౌతుందని తెలిపింది.

2030 నాటికి 1.9 ట్రిలియన్ డాలర్లకు భారత ప్రైవేట్ వినియోగ రంగం!
India's Private Consumption to Reach USD 1.9 Trillion by 2030: FICCI-Deloitte Report

ఢిల్లీ, ఆగస్టు 4: పెరుగుతున్న ప్రజల తలసరి ఆదాయం, శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ, విస్తరిస్తున్న మధ్యతరగతి వర్గం, ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ చెల్లింపుల విప్లవంతో భారత్‌లో ప్రైవేట్ వినియోగం 2030 నాటికి దాదాపు 1.9 ట్రిలియన్ డాలర్లకు (రూ.165 లక్షల కోట్లకు పైగా) చేరుకోనుందని FICCI, డెలాయిట్ (FICCI-Deloitte) సంయుక్త నివేదిక వెల్లడించింది.


ఇవాళ (మంగళవారం) ఢిల్లీలో జరిగిన 'FICCI MASSMERIZE 2026' ప్రారంభ సదస్సులో ఈ అధ్యయన నివేదికను విడుదల చేశారు. 2025 నాటికి దేశంలో 100 కోట్లకు పైగా ఇంటర్నెట్ చందాదారులు ఉండటంతో పాటు, 3.6 ట్రిలియన్ డాలర్ల విలువైన 2,280 కోట్ల (228 బిలియన్) యూపీఐ (UPI) లావాదేవీలు జరగడం ఈ వేగవంతమైన వృద్ధికి బలమైన ప్రాతిపదికగా నిలిచాయని నివేదిక పేర్కొంది.


మారిన భారతీయ వినియోగదారుల ఆలోచనా విధానం

భారతీయ వినియోగదారులు కేవలం వస్తువు ధర ఆధారంగా కాకుండా నాణ్యత, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, పర్యావరణ పరిరక్షణ ప్రాతిపదికగా ఉత్పత్తులను ఎంచుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది. FMCG, రిటైల్, ఈ-కామర్స్ రంగాల కంపెనీలు ఈ అవకాశాలను అందుకునేందుకు నాణ్యత, వినియోగదారుల హక్కులు, డిజిటల్ కామర్స్, డేటా సెక్యూరిటీ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

కిడ్నాప్ కేసు.. గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 06:25 PM