Share News

నెలకు 31 జీబీ

ABN , Publish Date - Apr 01 , 2026 | 03:00 AM

గత ఏడాది (2025) భారత స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల నెలవారీ డేటా వినియోగ సగటు 31 జీబీకి చేరింది. 2024లో నమోదైన 27.5 జీబీతో పోలిస్తే మరింత...

నెలకు 31 జీబీ

  • భారత మొబైల్‌ యూజర్ల సగటు డేటా వినియోగమిది..

  • నోకియా నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: గత ఏడాది (2025) భారత స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల నెలవారీ డేటా వినియోగ సగటు 31 జీబీకి చేరింది. 2024లో నమోదైన 27.5 జీబీతో పోలిస్తే మరింత పెరిగిందని అంతర్జాతీయ టెలికాం ఉత్పత్తుల తయారీ దిగ్గజం నోకియా తాజా నివేదికలో వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో నెలవారీ సగటు డేటా వినియోగం ఏటేటా 18 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వచ్చిందని తెలిపింది. నోకియా వార్షిక మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండెక్స్‌ (ఎంబీఐటీ) 13వ విడత రిపోర్టు ప్రకారం.. 2025లో దేశవ్యాప్త నెలవారీ 5జీ డేటా రద్దీ వార్షిక ప్రాతిపదికన 70 శాతం పెరిగి 12.9 ఎక్సాబైట్స్‌ (ఈబీ) కు చేరుకుంది. దేశవ్యాప్త మొత్తం డేటా రద్దీ 27 ఈబీలో 5జీ వాటా దాదాపు 47 శాతానికి పెరిగింది. మొత్తం డేటా రద్దీ గత ఐదేళ్లలో ఏటేటా 21.7 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. నోకియా నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..

ఇండియా @: నం.2

ప్రపంచంలో అత్యఽధిక 5జీ వినియోగదారులు, అత్యధిక 5జీ డేటా వినియోగం, అత్యధిక 5జీ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సె్‌స (ఎ్‌ఫడబ్ల్యూఏ) యూజర్ల పరంగా భారత్‌ రెండో స్థానంలో ఉంది.

25%

మొత్తం 5జీ డేటా రద్దీలో ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ యాక్సె్‌స(ఎ్‌ఫడబ్ల్యూఏ) వాటా. 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ వినియోగదారులు వార్షిక ప్రాతిపదికన రెట్టింపయ్యారు.

10 రెట్లు

గత ఏడాది మార్కెట్లోకి రూ.9,500 లోపు ధర కలిగిన బడ్జెట్‌ 5జీ ఫోన్ల సరఫరా వృద్ధి ఇది.

58%

మెట్రో నగరాల్లో మొత్తం డేటా రద్దీలో 5జీ వాటా

90%

గత ఏడాది మార్కెట్లోకి సరఫరా అయిన మొత్తం ఫోన్లలో 90 శాతం 5జీ సామర్థ్యం కలిగినవే.

89.2 కోట్లు

గత ఏడాది దేశంలోని యాక్టివ్‌ 4జీ ఫోన్ల సంఖ్య. అందులో 38.3 కోట్ల ఫోన్లు 5జీ సేవల వినియోగ సామర్థ్యాన్నీ కలిగి ఉన్నాయి.

2031 నాటికి

100 కోట్లు

భారత్‌లో 5జీ వినియోగదారుల వృద్ధిపై నోకియా అంచనా

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 03:01 AM