Share News

మీడియా, వినోద పరిశ్రమ వృద్ధి భేష్‌

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:48 AM

దేశంలో మీడియా, వినోద పరిశ్రమ జోరందుకుంది. గత ఏడాది (2025) ఈ పరిశ్రమ మార్కెట్‌ రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. 2024తో పోలిస్తే...

 మీడియా, వినోద పరిశ్రమ వృద్ధి భేష్‌

  • 2028 నాటికి రూ.3.3 లక్షల కోట్ల స్థాయికి

  • ఫిక్కీ-ఈవై నివేదిక

ముంబై: దేశంలో మీడియా, వినోద పరిశ్రమ జోరందుకుంది. గత ఏడాది (2025) ఈ పరిశ్రమ మార్కెట్‌ రూ.2.78 లక్షల కోట్లకు చేరింది. 2024తో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ. 2028 నాటికి ఇది ఏటా 7 శాతం వృద్ధి రేటుతో రూ.3.3 లక్షల కోట్లకు చేరుతుందని ఫిక్కీ-ఈవై విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. గత ఏడాది నమోదైన మీడియా, వినోద పరిశ్రమ నమోదు చేసిన రూ.2.78 లక్షల కోట్ల ఆదాయంలో రూ.లక్ష కోట్లకు పైగా డిజిటల్‌ మీడియా ద్వారా వచ్చింది. ఇందులో రూ.94,700 కోట్లు డిజిటల్‌ అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా వచ్చింది. 2024తో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువని ఫిక్కీ-ఈవై నివేదిక పేర్కొంది. ఇతర ప్రధాన అంశాలు

  • 2025లో మీడియా, వినోద పరిశ్రమ ప్రకటనల ఆదాయం రూ.1.5 లక్షల కోట్లు

  • 2024తో పోలిస్తే ప్రకటనల ఆదాయంలో 13.6 శాతం వృద్ధి

  • దేశ జీడీపీలో పరిశ్రమ ప్రకటనల ఆదాయం 0.41 శాతం

  • 60% వృద్ధితో రూ.16,300 కోట్లకు డిజిటల్‌ మీడియా సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయం

  • 2025లో 2 శాతం పెరిగిన ప్రింట్‌ మీడియా ప్రకటనల ఆదాయం

ఇవీ చదవండి:

యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ

క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 25 , 2026 | 05:48 AM