Share News

పరిశ్రమలకు పరిమిత స్థాయిలో ఎల్‌పీజీ

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:00 AM

ఎల్‌పీజీ కొరతతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు ఆయా కంపెనీలు వినియోగిస్తున్న...

పరిశ్రమలకు పరిమిత స్థాయిలో ఎల్‌పీజీ

న్యూఢిల్లీ: ఎల్‌పీజీ కొరతతో ఇబ్బంది పడుతున్న పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు ఆయా కంపెనీలు వినియోగిస్తున్న ఎల్‌పీజీలో 70 శాతం పరిమితికి లోబడి ఎల్‌పీజీ సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే ఏ ఒక్క పరిశ్రమకు రోజువారీ కేటాయింపు 200 టన్నులు మించకూడదని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఆయా పరిశ్రమలు, కంపెనీలకు ఎల్‌పీజీ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది. తమ ఉత్పత్తి ప్రక్రియలో ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయం లేని కంపెనీలకు మాత్రమే ఈ కేటాయింపులు జరపాలని కోరింది. దీంతో పాలిమర్‌, స్టీల్‌, ఫార్మా, గ్లాస్‌, వ్యవసాయం, ప్యాకేజింగ్‌, పెయింట్స్‌, మెటల్స్‌, సిరామిక్స్‌, ఫౌండ్రీలు, యురేనియం, భారజల తయారీ రంగాలకు మేలు జరగనుంది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 04:00 AM