Share News

భారత్‌కు ‘ఏ-’ క్రెడిట్‌ రేటింగ్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:01 AM

జపాన్‌కు చెందిన క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ జేసీఆర్‌.. భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను ‘బీబీబీ ప్లస్‌’ నుంచి స్థిర దృక్పథంతో ‘ఏ మైన్‌స’కు పెంచింది...

భారత్‌కు ‘ఏ-’ క్రెడిట్‌  రేటింగ్‌

35 ఏళ్ల తర్వాత మొదటిసారి

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ జేసీఆర్‌.. భారత్‌ సార్వభౌమ రేటింగ్‌ను ‘బీబీబీ ప్లస్‌’ నుంచి స్థిర దృక్పథంతో ‘ఏ మైన్‌స’కు పెంచింది. భారత్‌కు ‘ఏ’ స్థాయి పరపతి రేటింగ్‌ లభించడం 35 ఏళ్ల (1988) తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. బలమైన ఆర్థిక వృద్ధి, పటిష్ట ఆర్థిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 140 కోట్లకుపైగా జనాభా, 3.9 లక్షల కోట్ల డాలర్ల నామినల్‌ జీడీపీ కలిగిన భారత్‌.. 2026-27లో 6 శాతానికి పైగా వృద్ధి రేటును కొనసాగించవచ్చని జేసీఆర్‌ అంచనా వేసింది. పటిష్టంగా ఉన్న ప్రైవేటు వినియోగం, ప్రభుత్వ పెట్టుబడుల మద్దతుతో భారత్‌ దాదాపు 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని తన నివేదికలో జేసీఆర్‌ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:01 AM