జీడీపీ వృద్ధి 6 శాతం లోపే గోల్డ్‌మన్ శాక్స్
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:44 AM
పశ్చిమాసియా యుద్ధం ఈ సంవత్సరం (2026) భారత జీడీపీ వృద్ధి రేటుకు గండి కొట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది....
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఈ సంవత్సరం (2026) భారత జీడీపీ వృద్ధి రేటుకు గండి కొట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. దీనికి సంబంధించి మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 5.9 శాతానికి కుదించింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటు రెపోను కూడా ప్రస్తుత 5.25 శాతం నుంచి 5.75 శాతానికి పెంచే అవకాశం ఉందని తెలిపింది. ముడి చమురు సెగతో భారత్‌లో ద్రవ్యోల్బణం, ద్రవ్య, వాణిజ్య లోటు ఎగిసిపడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
ఇవీ చదవండి:
యుద్ధంతో ఇంధన సంక్షోభం, భారత్‌పైనా ఆ ప్రబావం ఉంది: మోదీ
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు