రూ.9.50 లక్షల కోట్లు
ABN , Publish Date - May 07 , 2026 | 06:22 AM
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్ అడ్డాగా మారింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశంలోని జీసీసీల మొత్తం ఆదాయం 10,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.50 లక్షల కోట్లు) చేరువైందని...
గత ఆర్థిక సంవత్సరానికి భారత్‌లోని జీసీసీల మొత్తం ఆదాయమిది..
దేశంలో 2,117కి పెరిగిన సెంటర్లు.. వాటిలో 23.6 లక్షల మంది ఉద్యోగులు
నాస్కామ్-జిన్నోవ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు భారత్ అడ్డాగా మారింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశంలోని జీసీసీల మొత్తం ఆదాయం 10,000 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9.50 లక్షల కోట్లు) చేరువైందని ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్, జిన్నోవ్ సంయుక్త నివేదికలో వెల్లడించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2024-25)లో జీసీసీల మొత్తం రెవెన్యూ 6,500 కోట్ల డాలర్లుగా నమోదైంది. రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు..
దేశంలోని జీసీసీల సంఖ్య 2,000 మార్క్‌ను దాటింది. ఈ మార్చి చివరినాటికి 2,117కు చేరుకుంది. వాటిల్లో 23.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీసీసీల 32 శాతం పెరిగింది.
ఫోర్బ్స్ గ్లోబల్ 2000 కంపెనీల్లో 506 ఇప్పటికే భారత్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయి.
దేశంలోని 1,200కు పైగా జీసీసీలు కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లర్నింగ్ (ఎంఎల్) సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అందులో 250కి పైగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నిర్వహిస్తున్నాయి.
దేశంలో 2.5 లక్షలకు పైగా ఏఐ,, ఎంఎల్ నిపుణులున్నారు. ప్రపంచ జీసీసీల్లో పనిచేస్తున్న ఏఐ నిపుణుల్లో 28 శాతానికి సమానమిది.
1080 సెంటర్లతో బెంగళూరు జీసీసీలకు కేంద్రంగా ఉంది. మొత్తం జీసీసీల్లో మూడో వంతు వాటా ఇది. ఫైనాన్షియల్ సర్వీసెస్ జీసీసీలకు హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా ఉంది. గత ఏడాది సగం బీఎ్‌ఫఎ్‌సఐ జీసీసీలు హైదరాబాద్‌నే ఎంచుకున్నాయి. పుణె, ఎన్‌సీఆర్, చెన్నై ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది ఏర్పాటైన సెంటర్లలో 5ు కోయంబత్తూర్, అహ్మదాబాద్, కోల్‌కతా, వడోదరా, కొచి వంటి నగరాలను ఎంచుకున్నాయి.
భారత్‌లో జీసీసీలు ఏర్పాటు చేసిన కంపెనీల్లో 63ుఅమెరికాకు చెందినవే. యూరప్, యూకే (21ు), ఏపీఏసీ(9ు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇతర దేశాలకు చెందిన కంపెనీలూ జీసీసీల ఏర్పాటుకు భారత్‌వైపు చూస్తున్నాయి. ప్రస్తుతం జర్మనీకి చెందిన 105 కంపెనీలు భారత్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయి. డెన్మార్క్, బెల్జియం, లక్సెంబర్గ్ సంస్థలు కూడా భారత్‌లో తమ సెంటర్లను విస్తరిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా