Share News

భవిష్యత్‌ యూనికార్న్‌లు.. ఐదేళ్లలో రెండింతలు

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:14 AM

సమీప భవిష్యత్‌లో యూనికార్న్‌గా ఎదిగేందుకు అవకాశమున్న భారత స్టార్ట్‌పలకు సంబంధించి ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన నివేదికను...

భవిష్యత్‌ యూనికార్న్‌లు.. ఐదేళ్లలో రెండింతలు

110కి చేరిన సంఖ్య.. హురున్‌ వెల్లడి

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో యూనికార్న్‌గా ఎదిగేందుకు అవకాశమున్న భారత స్టార్ట్‌పలకు సంబంధించి ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశా యి. గడిచిన ఐదేళ్లలో వీటి సంఖ్య రెట్టింపునకు పైగా (104 శాతం) పెరిగి 110కి చేరుకుందని రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాదిలో కొత్తగా 43 సంస్థలకు చోటు దక్కింది. గతంలో ఈ జాబితాలో ఫిన్‌టెక్‌,సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (ఎ్‌సఏఏఎస్‌) స్టార్ట్‌పలే అధికంగా ఉండేవని.. ఈ ఏడాది కృత్రిమ మేధ (ఏఐ), ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, క్లీన్‌ టెక్నాలజీ, ఏరోస్పేస్‌ రంగ స్టార్ట్‌పలు కూడా గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. 2000 లేదా ఆపై సంవత్సరంలో ప్రారంభమై, 20-50 కోట్ల డాలర్ల (రూ.1,900-4,750 కోట్లు) మధ్య స్థాయిలో మార్కెట్‌ విలువ కలిగి, వచ్చే ఐదేళ్లలో యూనికార్న్‌ హోదా సాధించగలిగే అవకాశాలున్న అన్‌ లిస్టెడ్‌ స్టార్ట్‌పలను ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది.

రూ.3 లక్షల కోట్ల పైమాటే...

భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా అవతరించేందుకు అవకాశమున్న 110 స్టార్ట్‌పల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్ల పైమాటేనని రిపోర్టు తెలిపింది. ఈ సంస్థల సగటు మార్కెట్‌ విలువ రూ.2,820 కోట్లుగా ఉందని, వీటిల్లో మొత్తం 1.10 లక్షల మంది పనిచేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:14 AM