యూనికార్న్‌ల్లో భారత్ నం.4
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:31 AM
ఈ ఏడాదికి గాను ప్రపంచవ్యాప్త యూనికార్న్‌లకు సంబంధించిన జాబితాను హురున్ విడుదల చేసింది. అత్యధిక యూనికార్న్‌లున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ...
ఇండియాలో అత్యంత విలువైన యూనికార్న్ జెప్టో
ప్రపంచవ్యాప్త జాబితా విడుదల చేసిన హురున్
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను ప్రపంచవ్యాప్త యూనికార్న్‌లకు సంబంధించిన జాబితాను హురున్ విడుదల చేసింది. అత్యధిక యూనికార్న్‌లున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే మాత్రం మెట్టు కిందికి జారింది. హురున్ నివేదిక ప్రకారం.. దేశంలో 61 యూనికార్న్‌లున్నాయి. కనీసం ఒక బిలియన్ (100 కోట్ల డాలర్లు = రూ.9,500 కోట్లు) డాలర్ల మార్కెట్ విలువ కలిగిన స్టార్ట్‌పలను యూనికార్న్‌గా పిలుస్తారు.
806 యూనికార్న్‌లతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. చైనా (381), యునైటెడ్ కింగ్‌డమ్ (70) వరుసగా 2, 3 స్థానాలను దక్కించుకున్నాయి.
నగరాలవారీగా చూస్తే, 222 యూనికార్న్‌లతో శాన్‌ఫ్రాన్సిస్కో మొదటి స్థానంలో, న్యూయార్క్ (141) రెండో స్థానంలో ఉన్నాయి. బీజింగ్ (86), షాంఘై (74) వరుసగా 3,4 స్థానాల్లో నిలిచాయి. లండన్ ఐదో స్థానంలో ఉండగా.. 25 యూనికార్న్‌లతో బెంగళూరు 9వ స్థానానికి జారుకుంది. 13 యూనికార్న్‌లతో ముంబై 23 స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 1,603 యూనికార్న్‌లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే సంఖ్య 5.3 శాతం (80) పెరిగింది. వీటి మొత్తం మార్కెట్ విలువ 8 లక్షల కోట్ల డాలర్లకు (రూ.760 లక్షల కోట్లు) చేరుకుంది. 2025తో పోలిస్తే విలువ 43 శాతం ఎగబాకింది. గడిచిన ఏడాది కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) స్టార్ట్‌పల వాల్యూయేషన్లు అనూహ్యంగా పెరగడం ఇందుకు కారణం.
భారత్‌లో అత్యంత విలువైన యూనికార్న్ జెప్టో. దా ని విలువ 900 కోట్ల డాలర్లు (రూ.85,500 కోట్లు)గా ఉంది. అంతేకాదు, ప్రపంచ టాప్-100 యూనికార్న్ ల లిస్ట్‌లో ఏకైక భారత స్టార్టప్ కూడా జెప్టోనే.
ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ 96,500 కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత విలువైన యూనికార్న్‌గా అవతరించింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 7 స్థానాలు ఎగబాకింది. చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్‌ఏఐ 85,200 కోట్ల విలువతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. బైట్‌డాన్స్ (48,000 కోట్ల డాలర్లు), స్ర్టైప్ (15,900 కోట్ల డాలర్లు), డేటాబ్రిక్స్ (13,400 కోట్ల డాలర్లు) వరుసగా 3,4,5 స్థానాల్లో నిలిచాయి.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..
IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..