ఫారెక్స్ నిల్వల్లో సరికొత్త రికార్డు
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:03 AM
మన విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి పెరిగాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు మరో 1,242.2 కోట్ల డాలర్ల వృద్ధితో...
8 72,932 కోట్ల డాలర్లకు చేరిక
న్యూఢిల్లీ: మన విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి పెరిగాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు మరో 1,242.2 కోట్ల డాలర్ల వృద్ధితో మొత్తం 72,932.80 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ నిల్వలు 990.5 కోట్ల డాలర్ల మేర పెరిగాయి. ఫారెక్స్ నిల్వల్లో గత ఆల్‌టైం రికార్డు ఈ ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో 72,849.4 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఆ తర్వాత మొదలైన పశ్చిమాసియా సంక్షోభంతో వరుసగా కొన్ని వారాల పాటు ఫారెక్స్ నిల్వలు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి.
ఈ నెల 21తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వల్లో మెజారిటీ విభాగమైన విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 948.2 కోట్ల డాలర్ల పెరుగుదలతో మొత్తం 59,133.3 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లతో పాటు ఇతర రాయితీలతో దేశంలోకి ఇప్పటివరకు 7,200 కోట్ల డాలర్ల మేర విదేశీ నిధులు వచ్చాయని ఈ మధ్యనే ఆర్‌బీఐ వెల్లడిచింది. ఇకపోతే, ఫారెక్స్ నిల్వల్లోని మరో ప్రధాన విభాగమైన బంగారం నిల్వల విలువ 280.1 కోట్ల డాలర్ల పెరుగుదలతో 11,421.8 కోట్ల డాలర్లకు చేరుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు