Share News

మే నెల ఎగుమతులు.. 6 నెలల గరిష్ఠ స్థాయికి

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:55 AM

కష్టకాలంలోనూ మన దేశ ఎగుమతులు పెరుగుతున్నాయి. మే నెలలో భారత్‌ నుంచి 4,520 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.28 లక్షల కోట్లు) విలువైన వస్తు, సేవలు ఎగుమతయ్యాయి....

మే నెల ఎగుమతులు.. 6 నెలల గరిష్ఠ స్థాయికి

న్యూఢిల్లీ: కష్టకాలంలోనూ మన దేశ ఎగుమతులు పెరుగుతున్నాయి. మే నెలలో భారత్‌ నుంచి 4,520 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.28 లక్షల కోట్లు) విలువైన వస్తు, సేవలు ఎగుమతయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 2,188 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఆరు నెలల్లో మన దేశ ఎగుమతులు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో చమురు సెగతో దిగుమతులు 10 శాతం పెరిగి మూడు నెలల గరిష్ఠ స్థాయి 7.341 కోట్ల డాలర్లకు చేరడంతో మే నెల వాణిజ్య లోటు 2,821 కోట్ల డాలర్ల (సుమారు రూ.2.8 లక్షల కోట్లు)కు చేరింది.

అమెరికా నుంచి 54% పెరిగిన దిగుమతులు: మే నెలలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు ఏ మాత్రం ఎదుగుబొదుగు లేకుండా 881 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. అయితే దిగుమతులు మాత్రం ఏకంగా 54.43 శాతం పెరుగుదలతో 587 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది మే నెలలో అమెరికాకు ఎగుమతులు 882 కోట్ల డాలర్లుగా ఉండగా దిగుమతులు మాత్రం 380 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. మరోవైపు చైనాకు ఎగుమతులు 24.8 శాతం వృద్ధితో 200 కోట్ల డాలర్లకు చేరుకోగా దిగుమతులు కూడా 22.15 శాతం పెరిగి 1,280 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి..

ఐదు కంపెనీలుగా వేదాంతా.. కొత్త కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో అరంగేట్రం..

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. స్వాగతించిన ప్రధాని మోదీ..

Updated Date - Jun 16 , 2026 | 01:55 AM