Share News

ఈవీ రంగంలోకి గత ఐదేళ్లలో రూ.2.23 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:03 AM

గడిచిన ఐదేళ్లలో (2020-25) దేశీయ విద్యుత్‌ వాహ న రంగంలోకి రూ.2.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉంటాయని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌...

ఈవీ రంగంలోకి గత ఐదేళ్లలో రూ.2.23 లక్షల కోట్ల పెట్టుబడులు

ఐఈఈఎఫ్ఏ నివేదిక అంచనా

న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్లలో (2020-25) దేశీయ విద్యుత్‌ వాహ న రంగంలోకి రూ.2.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉంటాయని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌ (ఐఈఈఎఫ్ఏ) తాజా నివేదిక అంచనా వేసింది. కానీ, 2030 లక్ష్యాల సాధనకు అవసరమైన రూ.12.50 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇది కేవలం 18 శాతమేనని పేర్కొంది. కాబట్టి, ఈ ఐదేళ్లలో ఈవీ రంగంలోకి పెట్టుబడులు భారీగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 2030 నాటికి మిగతా రూ.10.2 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించేందుకు వ్యవస్థాగత ఫైనాన్సింగ్‌ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐఈఈఎ్‌ఫఏ నివేదిక సహ రచయిత శుభమ్‌ శ్రీవాస్తవ అన్నారు. 2030 నాటికి ఈవీల వాటా ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో 30 శాతానికి, వాణిజ్య వాహన అమ్మకాల్లో 70 శాతానికి, బస్సుల విక్రయాల్లో 40 శాతానికి, ద్వి మరియు త్రిచక్ర వాహన సేల్స్‌లో 80 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169

Updated Date - Feb 26 , 2026 | 06:03 AM