ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో జోరు
ABN , Publish Date - May 07 , 2026 | 06:15 AM
ఈ ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 23,506 ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి గత ఏడాది ఇదే కాలంలో...
ఏప్రిల్‌లో 75.14 శాతం పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా 23,506 ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 13,421 యూనిట్లతో పోలిస్తే 75.14 శాతం అధికమని ఆటోమొబైల్ డీలర్ల సంఘం ఫాడా వెల్లడించింది. కాగా, ఈ విభాగంలో 8,543 యూనిట్ల విక్రయాలతో (77.17 శాతం వృద్ధి) టాటా మోటార్స్ మార్కెట్ లీడర్‌గా నిలిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 5,413 యూనిట్ల విక్రయాలతో 63.98 శాతం వృద్ధిని సాధించి మహీంద్రా అండ్ మహీంద్రా రెండో స్థానంలో నిలువగా.. జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా 3,777 యూనిట్ల (32.54 శాతం వృద్ధి)తో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర విభాగంలోనూ ఇదే జోరు కన్పించింది. ఏప్రిల్‌లో ఈ విభాగం మొత్తం 1,48,740 యూనిట్ల అమ్మకాలతో 60.73 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
ట్రంప్ వల్లే నా సంసార జీవితంలో ఇబ్బందులు: బరాక్ ఒబామా