Share News

దూసుకుపోతున్న భారత్ వృద్ధి రేటు.. ఏకంగా 7.7 శాతం!

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:07 PM

భారత వృద్ధి రేటు దూసుకుపోతుంది. 2026 జనవరి-మార్చి మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం మేర పెరిగిందని కేంద్రం తాజాగా వెల్లడించింది.

దూసుకుపోతున్న భారత్ వృద్ధి రేటు.. ఏకంగా 7.7 శాతం!
India Growth Rates in 2026 Jan-March Quarter

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితులను తట్టుకుని భారత్ ఆర్థికంగా వృద్ధి పథనంలో పయనిస్తోంది. గతేడాది కంటే మెరుగైన వృద్ధి రేటును సాధించింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్‌టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2026 జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్ 7.7 శాతం వృద్ధి రేటు సాధించింది. గతేడాది ఇదే కాలంతో (7.1 శాతం) పోలిస్తే మరింత మెరుగైన ఫలితాన్ని సాధించింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత దేశ రియల్ జీడీపీ రూ.323.12 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు, నామినల్ జీడీపీ 8.9 శాతం మేర పెరిగి రూ.346.36 లక్షల కోట్లకు చేరింది.


పారిశ్రామిక ఉత్పత్తి, జీఎస్టీ కలక్షన్లు, కార్పొరేట్ రంగం ఫలితాలు, వాహనాల విక్రయాలు, సరకు రవాణా, టెలికం వాడకం, బ్యాంకింగ్ కార్యకలాపాలు, వసూలైన పన్నులు, వాణిజ్య డేటా ఆధారంగా వృద్ధి రేటు అంచనాను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2022-23ను ప్రామాణిక సంవత్సరంగా పరిగణిస్తూ రూపొందించిన కొత్త జీడీపీ గణాంకాల ఆధారంగా ప్రభుత్వం తాజా అంచనాలను రూపొందించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) గణాంకాలు ఆగస్టు 31న విడుదల కానున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ

వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..

Updated Date - Jun 05 , 2026 | 05:13 PM