Share News

2030 నాటికి రూ.32.7 లక్షల కోట్లు

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:03 AM

రానున్న కాలంలో భారత ఈ-కామర్స్‌ రంగం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2024 సంవత్సరంలో 12,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ 2030 నాటికి...

2030 నాటికి రూ.32.7 లక్షల కోట్లు

  • 8డార్క్‌ స్టోర్లు మూడింతలు

  • 8భారత ఈ-కామర్స్‌ మార్కెట్‌పై ఇన్ఫిసమ్‌ నివేదిక

న్యూఢిల్లీ: రానున్న కాలంలో భారత ఈ-కామర్స్‌ రంగం భారీగా వృద్ధి చెందే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2024 సంవత్సరంలో 12,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి 34,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.32.77లక్షల కోట్లు)కు చేరుకునే అవకాశం ఉందని రీసెర్చ్‌ కన్సల్టెన్సీ ఇన్ఫిసమ్‌ నివేదిక పేర్కొంది. క్విక్‌ కామర్స్‌ (నిమిషాల్లో సరుకుల డెలివరీ) విభాగం వేగవంతంగా విస్తరించడం, కృత్రిమ మేధ (ఏఐ) ఇంటిగ్రేషన్‌ ఇందుకు కారణంగా తెలిపింది. డార్క్‌ స్టోర్ల విషయానికి వస్తే.. 2025లో దేశంలో 2,525 డార్క్‌ స్టోర్లు ఉండగా.. 2030 నాటికి దాదాపు మూడింతలు పెరిగి 7,500కు చేరుకునే ఆస్కారం ఉంది. వేగవంతంగా డెలివరీలు చేయడానికి పెరుగుతున్న డిమాండ్‌ ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. దేశీయ ఈ-కామర్స్‌ రంగంలో క్విక్‌ కామర్స్‌ వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా ఉందని పేర్కొంది. 2030నాటికి 6,500-7,000 కోట్ల డాలర్ల విలువ కలిగి ఉండే అవకాశం ఉన్న ఈ విభాగం రాబోయే ఐదేళ్లలో ఈ-రిటైల్‌ రంగంలో నమోదయ్యే అదనపు వృద్ధిలో 45-50 శాతం సమకూర్చవచ్చని నివేదిక అంచనా వేసింది. ఈ రంగంలో వృద్ధికి జెన్‌ జీ ప్రధాన చోధకంగా ఉన్నట్టు నివేదిక గుర్తించింది. వీరు ఇప్పటికే ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల్లో దాదాపు మూడింట ఒక వంతు ఉన్నారు. 2030 నాటికి దేశంలోనే అతిపెద్ద డిజిటల్‌ వ్యయ సమూహంగా జెన్‌ జీ మారుతుందని అంచనా.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:03 AM