Share News

2025-26లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు

ABN , Publish Date - May 05 , 2026 | 05:17 AM

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కేంద్ర ప్రభుత్వ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.12 శాతం పెరిగి రూ.23.40 లక్షల కోట్లకు పైగా..

2025-26లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు

రూ.23.40 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కేంద్ర ప్రభుత్వ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 5.12 శాతం పెరిగి రూ.23.40 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. కానీ గత ఆర్థిక సంవత్సరానికి సవరించిన లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.25.20 లక్షల కోట్ల (వాస్తవ బడ్జెట్‌ అంచనా) నుంచి రూ.24.21 లక్షల కోట్లకు సవరించింది. అయినా ఈ స్థాయిలో పన్ను వసూళ్లు జరగలేదు. ఫిబ్రవరి 1న ప్రకటించిన 2025-26 బడ్జెట్‌లో ఆదాయ పన్నును తగ్గించడం వల్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నిస్తేజంగా ఉండటానికి కారణమైనట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

బెంగాల్‌‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి

Updated Date - May 05 , 2026 | 05:17 AM